బిగ్ బ్రేకింగ్; టీడీపీ అవినీతి విచారణను సిబిఐకి అప్పగించిన ఏపీ సర్కార్…!

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ అవినీతి జరిగిందని ఆరోపించిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ అవినీతిని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఈ తరుణంలో జగన్ అనుసరిస్తున్న దూకుడు ఆ పార్టీని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది. చంద్రబాబు హయాంలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అనేది జగన్ ఆరోపణ. ఇప్పుడు ఆ అవినీతిని బయటపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అవినీతి మీద సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సిట్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అవినీతి మీద విచారణ పూర్తి స్థాయిలో జరుపుతుంది. ఈ అవినీతి ఎక్కడి వరకు బయటకు లాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల అక్రమాలపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజధాని భూముల్లో గత ప్రభుత్వం ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడిందని నిర్ధారణకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వస్తూనే రాజధాని భూ అక్రమాలపై జగన్ కేబినేట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సిబిఐ విచారణ చెయ్యాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక జీవో విడుదల చేసింది రాష్ట్ర హోం శాఖ. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరి ఈ తరుణంలో సిబిఐ విచారణ చెయ్యాలి అనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఏ మేరకు పరిశీలిస్తుందో చూడాల్సి ఉంది. అమరావతిలో భారీగా టీడీపీ నేతలు కొందరు భూములను కొనుగోలు చేసారు. వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version