శభాష్ హైదరబాద్ పోలీసు .. అద్దరగొట్టేశారు..!!

-

దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు భారతదేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బయటికి రాకూడదని పిలుపు ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్ది కేసులు బయట పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు చేపడుతున్నారు కేసీఆర్. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం కావటంతో చాలామంది సాఫ్టువేర్ ఉద్యోగస్తులు ఉండటంతో…ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఎక్కువగా విదేశాల నుండి రావడంతో సాఫ్టువేర్ కంపెనీ ఉద్యోగస్తులకు హైటెక్ సిటీ వంటి నగరాలలో ఎక్కువ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చాలావరకు కంపెనీలు వర్క్ ఎట్ హోం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో జనతా కర్ఫ్యూ భాగంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిన సందర్భంలో…కొంతమంది కక్కుర్తి మనుషులు…ఇష్టానుసారంగా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడంతో హైదరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకుని అదిరిపోయే ట్రీట్మెంట్ ఇచ్చారు.హైదరాబాదులో నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ లను అదుపులోకి తీసుకొని వాళ్లకి వార్నింగ్ ఇస్తూ రోడ్లపైకి ఆటోలు క్యాబ్ లు వస్తే సీజ్ చేస్తామని…వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ దుకాణాలను మూసివేస్తున్నారు అధికారులు. దీంతో చాలావరకు జనాలు పోలీస్ పనితనాన్ని మెచ్చుకుంటూ శభాష్ హైదరాబాద్ పోలీస్ ….డ్యూటీ అదరగొడుతున్నారు మమ్మల్ని కాపాడుతున్నారు అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులను తెలిపే ప్లకార్డులను కాసేపు రోడ్డుపై పట్టుకొని నిలబడాలని…నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పైకి వచ్చిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version