మా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. భారీ మెజారిటీతో మంచు విష్ణు గెలిచినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా మా ఎన్నికల పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట నలుగురు సభ్యులు అధ్యక్ష బరిలో దిగుతునట్టు ప్రకటించగా ఆ తర్వాత మంచు విష్ణు ప్రకాష్ ఇద్దరు బరిలో నిలిచారు. ఇక ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయగా మంచు విష్ణు మిగతా పెద్ద హీరోల అందరి మద్దతు కోరారు.
అంతేకాకుండా ఈసారి మా రాజకీయాలు వాడివేడిగా సాగాయి. తాయిలాలు ఇవ్వడం నుండి పార్టీలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడమే కాకుండా పర్సనల్ గా దూషించు ఉన్నారు. ఇక ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. మరి మంచు విష్ణు మా ను ఎలా నడిపిస్తారు… ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి.