ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్థానిక ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రధా న రాజకీయ పక్షాలన్నీ ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో కార్యాచరణకు దిగిపోనున్నాయి. నిన్న మొన్నటి వరకు రిజర్వేషన్ విష యం సందిగ్ధంతో ఉండడంతో .. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ప్రత్యేక అధికారుల పాలనను రంగంలోకి దింపారు. రాజకీయ కారణాలతోనే అప్పట్లో చంద్రబా బు స్థానిక ఎన్నికలకు వెళ్లలేదనేది నిర్వివాదాంశం. ఇక ఈ ఎన్నికలు బాబు వర్సెస్ జగన్ అన్నట్టుగానే జరగనున్నాయి.
అప్పట్లో అంటే రెండేళ్ల కిందటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం రాజకీ యంగా దుమా రం రేపింది. ప్రజల్లోనూ బలంగా వినిపించింది. ఇదే సమయంలో కేంద్రంతో చంద్రబాబు పెట్టుకున్న వైరంతో బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శ లు గుప్పించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదని భావించిన చంద్రబాబు ప్రత్యేక అధికారు లను నియమించి కాలం గడిపేశారు. ఇక, జగన్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు నిర్వహించాలంటూ.. హైకోర్టు ఆదేశించింది. అయి తే, రిజర్వేషన్ల విషయంతో ఏడు మాసాలు గడిచిపోయాయి.
తాజాగా ఇటీవల రిజర్వేషన్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 50శాతం మహిళలకు రిజర్వేషన్ ప్రకటించారు. దీనికితోడు అన్ని నిబంధనలను హైకోర్టుకు అందించారు. దీంతో తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 17న స్థానిక ఎన్నికలకు హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేసి, మార్చి 3నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెండు విడతల్లో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను కోర్టు ఆమోదించింది. దీంతో ఇప్పుడు ఇక, రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెంచేందుకు రెడీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం ఉద్యమాలతో వేడి పుట్టిస్తోంది. మిగిలిన పక్షాలు పెద్దగా ఊపు చూపించకపోయినా.. ఈ రెండు పార్టీల మధ్య `గుర్తు`ల ఆధారంగా జరిగే ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.