గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డిపై మాకు ఫిర్యాదు రాలేదని వివరించారు. లేదంటే పీసీసీ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు ఫిర్యాదు రాలేదు కాబట్టే చర్చించలేదన్నారు.

స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి.. అందరూ సంయమనం పాటించాలన్నారు ఎంపీ మల్లు రవి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శ్రీరంగ నీతులు చెప్తున్నారన్నారు మల్లు రవి. వాళ్లు రాజకీయ పార్టీ నాయకులు.. మేం సన్యాసుల పార్టీ నాయకులమా ? అంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో మీరే పునరాలోచించుకోవాలని వెల్లడించారు ఎంపీ మల్లు రవి.