కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓటమి తథ్యం అని బాంబ్ పేల్చారు మెట్టు సాయికుమార్. సిరిసిల్లలో కేటీఆర్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోడన్నారు.

చిల్లర మాటలు మాట్లాడే కేటీఆర్.. గత పదేళ్లు అధికారంలో ఉండి బీసీలు, దళితులు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పై పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు మెట్టు సాయికుమార్.