ఏపీలోని సర్పంచ్ లకు మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న సర్పంచుల డిమాండ్ ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
సచివాలయాలకు పంచాయతీలతో సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్న ప్రభుత్వం, సర్పంచు ల ఆధ్వర్యంలోని పంచాయతీ కార్యదర్శులకు సచివాలయాల నిర్వహణ, ఉద్యోగులపై పర్యవేక్షణ, ప్రత్యక్ష పరిశీలన, సమన్వయం వంటి కీలక బాధ్యతలను అప్పగించింది.
గ్రామస్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లతో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమన్వయ బాధ్యతను కట్టబెట్టింది. ఈ మేరకు కార్యదర్శుల జాబ్ చార్ట్ ను తాజాగా సవరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.