విక్టరీ వెంకటేశ్.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ పేరుతో వెంకీ తన 75వ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది సైంధవ్ చిత్రబృందం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ లుక్స్ అదిరిపోయాయి.
రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటేశ్ ఓ చేతిలో గన్ పట్టుకుని.. మరో చేతిలో ఓ ఇంజెక్షన్ పట్టుకుని కనిపిస్తూ ‘నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ గ్లింప్స్‌ను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ ‘విక్రమ్’ స్టైల్లో వెంకీ లుక్ ఉందని, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా ‘విక్రమ్’ టెంప్లేట్‌ను గుర్తు చేస్తోందని అంటున్నారు. ఈ గ్లింప్స్‌లో ఇవి కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది ఒకటి ఉంది.
ఈ గ్లింప్స్‌లో మొదట వెంకీ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళ్తారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దాని కింద Genezo అని రాసి ఉంది. ఇది జన్యువుల మీద పరిశోధనలు చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్! ఆ తర్వాత ఆ బాక్స్‌ను ఓపెన్ చేసిన వెంకీ.. లిక్విడ్ ఉన్న ఓ వయల్‌ను తీసి చేత్తో పట్టుకుంటారు. దాని మీద onasemnogene abeparvovec అని రాసి ఉంది. దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. SMA (Spine Muscular Atrophy) అనే వ్యాథికి వాడే జీన్ థెరపీ మెడికేషన్ అని తెలిసింది. ఈ మెడిసిన్‌ను Zolgensma పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్‌లో ఒకటి. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు. మనం ఈ పేర్లతో గూగుల్ సెర్చ్ చేస్తే అనేక కథనాలు కూడా వస్తాయి. ఆ మధ్యలో చాలా మంది పసిపిల్లలు ఈ SMA వ్యాధితో పోరాడి కన్నుమూశారు. వారిలో చాలామందికి ఈ Zolgensma ఇంజెక్షన్‌ను అందించినా ఫలితం దక్కలేకపోయింది. కొంతమంది మాత్రం ఈ ఇంజక్షన్ ద్వారానే ప్రాణాలతో బయటపడ్డారు.
గ్లింప్స్‌లో వెంకటేశ్ ఈ డ్రగ్ ద్వారా ఎవరినైనా చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఆ చిన్నారి ఆయన కూతురా? ఈ క్రమంలోనే విలన్లతో పోరాడతారా?.. అసలీ కథ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుందా? అనేది తెలియాల్సి ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్ కూడా… ‘నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను.. అంటూ ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేశ్ కొట్టి పడేసి ఉంటారు. మరి విషయం ఏంటనేది సినిమా వస్తే గానీ క్లారిటీగా తెలియదు.
ఈ గ్లింప్స్‌ను ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో చూపించారు శైలేశ్ కొలను. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తర్వాత దర్శకుడు శైలేశ్ ఓ ట్వీట్ చేశారు. “ఇది ట్రిబ్యూట్ మాత్రమే కాదు. నేను వెంకటేశ్ గారి కోసమే దర్శకుడిగా మారానని అనిపిస్తుంటుంది. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని ఆశిస్తున్నాను. వెంకటేశ్, ఆయన అభిమానులు గర్వపడేలా శాయశక్తులా శ్రమించి ఈ సినిమా తీస్తా” అని అన్నారు.