ఏటీఎం వినియోగదారులకు బిగ్‌షాక్.. ఇక బాదుడే బాదుడు!

-

ఏటీఎం వినియోగదారులకు బ్యాంకులు బిగ్ షాక్ ఇచ్చాయి. నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో ఇప్పటివరకు బ్యాంకులు కల్పించిన 5 లావాదేవీల లిమిట్ (సొంత బ్యాంకు ఏటీఎం), మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలు) దాటితే భారీగా చార్జీల వసూలు చేసేందుకు సిద్దమయ్యాయి.

ఇకపై ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలో 5 లిమిట్ దాటితే ఏటీఎం ఒక్కో విత్‌డ్రాల్‌పై రూ.23 చార్జి వసూలు చేయనున్నది. డబ్బులు విత్‌డ్రాల్‌ చేయడానికి సేమ్ బ్యాంక్ అయితే 5 విత్‌డ్రాల్‌.. వేరే బ్యాంక్ అయితే మెట్రో నగరాల్లో 5 విత్‌డ్రాల్‌, ఇతర ప్రాంతాల్లో 3 విత్‌డ్రాల్ ‌ లిమిట్ మాత్రమే ఇచ్చింది. ఈ లిమిట్ దాటితే ఒక్కో విత్‌డ్రాల్‌పై రూ.23 చార్జ్ చేయడానికి బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. పెరిగిన చార్జీలు మే 1 నుండి అమలు లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news