‘రైల్వే కౌంటర్‌లో టికెట్ కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు’

-

రైలు ప్రయాణికుల కోసం కేంద్ర రైల్వేశాఖ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయాణికులు తమ టిక్కెట్లు రద్దు చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదనిత. టికెట్‌ కౌంటర్‌లో టికెట్ కొన్నా..  ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లేదా 139కి ఫోన్‌ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చని వెల్లడించారు. రిఫండ్స్‌ కోసం మాత్రం రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

టికెట్ క్యాన్సిల్ ఇలా చేసుకోవాలి.. 

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి MORE అనే ఆప్షన్‌ క్లిక్ చేసి.. కౌంటర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కౌంటర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌ పేజీ ఓపెన్‌ కాగానే.. PNR నంబర్, రైలు నంబర్‌ను క్యాప్చాతో ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత, బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • ఓటీపీని ధ్రువీకరించిన తర్వాత స్క్రీన్ పై కనిపించే PNR వివరాలను ధ్రువీకరించి, పూర్తి రద్దు కోసం ‘టికెట్ రద్దు చేయండి’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మనకు రావాల్సిన వాపసు మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఈ వివరాలతో ఫోన్‌కు వచ్చే మెసేజ్ ను సమీప స్టేషన్‌ కౌంటర్లలో చూపించి వాపసు డబ్బును పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news