తెలంగాణలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్: TV9 సర్వే

-

తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని TV9 సర్వే చెబుతోంది. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.

ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి 13, తెలుగుదేశం పార్టీకి 9, బీజేపీకి 2 జనసేన ఒక స్థానంలో గెలుస్తాయని TV9 సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేవని పేర్కొంది. కాగా గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో గెలవగా.. తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లే (గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం) గెలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version