ఆ స్కీమ్ లో డబ్బులు పెడుతున్నారా..? అయితే మీకు పెద్ద షాక్ ఏ..!

-

కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్ కి అత్యంత ప్రజాదారణ కూడా లభించింది. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం లోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో 10 ఏళ్లలోపు వయసు ఉన్న ఆడపిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు.

15 ఏళ్ల పాటు ఇందులో డిపాజిట్ చెయ్యాలి. స్థిరమైన వడ్డీని ఇస్తోంది కేంద్రం. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈసారి వడ్డీ రేట్ల పెంపు చేపట్టాలని కస్టమర్స్ అడుగుతున్నారు. మరి కేంద్రం ఏం చేస్తుందా అని అంతా చూస్తున్నారు. ఈ పథకం ని ప్రవేశ పెట్టిన తొలి నాళ్ల లో మంచి వడ్డీ రేటును ఇచ్చేవారు. కానీ ఇప్పుడేమి అంత ఇవ్వడం లేదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీ కంటే కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది. కానీ గత 12 త్రైమాసికాల నుండి ఏమి మార్చలేదు. ఇప్పుడు 7.6 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది కేంద్రం. 2023-24 ఆర్థిక ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ కొత్త ఏడాది తొలి త్రైమాసికం లో సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని అంటున్నారు.

దీనితో ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టేవాళ్ళకి షాక్ తగిలింది. 2020-21 ఆర్థిక ఏడాది లో వడ్డీ రేటును 8.4 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించింది. పీపీఎఫ్ వడ్డీ రేటును సైతం 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించేశారు. తర్వాత సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్ల లో మార్పులు చేయలేదు. కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version