బెజవాడ టీడీపీకి బిగ్ షాక్….?

-

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేదానిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి అనే టీడీపీ నేతలే అంటున్నారు. తాజాగా విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేసినేని నాని కుమార్తెను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె అభ్యర్ధిత్వం విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చాలావరకు సంతోషంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే భావన ఉంది. ఆమె విషయంలో చాలా మంది నేతలు అసహనం గా ఉండడం…

అలాగే పార్టీ అధిష్టానం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధమవుతున్నారట. వైసీపీలో అధికారికంగా చేరడానికి కొంతమంది నేతలు సిద్ధమయ్యారు అని దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసిన తమకు గుర్తింపు లేదని విజయవాడ పార్లమెంట్ స్థానం విషయంలో కూడా తమ పార్టీ తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version