తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఇటీవల నియమితులయ్యారు. ఆర్.ఎస్.ఎస్ నాయకుల దీవెనలు మరియు కెసిఆర్ కి దగ్గరగా ఉండే కీలక నాయకుడిని చిత్తు చిత్తుగా ఓడించిన అనుభవం ఉండటంతో సంజయ్ కి బిజెపి పార్టీ పెద్దలు అధ్యక్ష పదవిని అక్కడ చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా విపక్ష పార్టీలు అధికార పార్టీలను ఎక్కి పారేసిన సంజయ్ రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జండా ఎగరాలని ఎగిరెగిరి పడుతూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో ఉన్న నాయకులు బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం చెందుతున్నారు. ఏకచ్ఛత్రాధిపత్యం తో సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళి పోతున్నారు అంటూ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ అధిష్టానం బండి సంజయ్ నీ రంగంలోకి దించడం పట్లా చాలామంది ఇష్టపడటం లేదు. దీంతో ఆదిలోనే సొంత పార్టీ నుండి ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో బండి సంజయ్ కి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చినట్లయింది.