బ్రేకింగ్; సెలెక్ట్ కమిటికి రాజధాని విభజన బిల్లు జగన్ సర్కార్ కి బిగ్ షాక్…!

-

రాజధాని విభజన బిల్లు సెలెక్ట్ కమిటికి వెళ్ళింది. తనకు ఉన్న విచక్షణాధికారంతో రాజధాని బిల్లుని, సిఆర్దియే రద్దు బిల్లుని చైర్మన్ సెలెక్ట్ కమిటికి పంపించారు. తనకు ఉన్న విచక్షణ అధికారాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించిన చైర్మన్ పై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనితో ఒక్కసారిగా రాజధాని విభజన అనేది ఆగిపోయింది. ఇక్కడికి వెళ్తే దాదాపు మూడు నెలల పాటు రాజధాని బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు.

సుధీర్గ చర్చల అనంతరం రాజధాని బిల్లుని సెలెక్ట్ కమిటికి పంపడానికే మండలి చైర్మన్ షరీఫ్ మొగ్గు చూపారు. నిన్న ఉదయ౦ నుంచి అనేక మార్లు మండలి వాయిదా పడుతూ వచ్చింది. దీనితో అసలు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజకీయంగా ఈ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.

నిన్న మండలిని రద్దు చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ బిల్లుని ఎలా అయినా ఆమోదింప చేసే విధంగా నానా ప్రయత్నాలు చేసారు. బిల్లుని సెలెక్ట్ కమిటికి పంపాలి అని ఏ పక్షం అయితే డిమాండ్ చేస్తుందో ఆ పక్షానికి మెజారిటి ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నారు.

రూల్ 71లో నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఎలా అయినా సరే బిల్లుని సెలెక్ట్ కమిటికి పంపాలి అనే విషయమై పట్టు బట్టింది. టీడీపీ కి మండలిలో బలం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో చైర్మన్ కూడా దానికే మొగ్గు చూపారు. అయితే సెలెక్ట్ కమిటికి బిల్లుని పంపించ వద్దని, మంత్రి బొత్సా సత్యనారాయణ సహా పలువురు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయినా సరే చైర్మన్ వెనక్కు తగ్గలేదు. తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని సెలెక్ట్ కమిటికి పంపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version