రాపాక మీద ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన జగన్ – ఇది ఊహకందని  ట్విస్ట్ !

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుండి జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ తరుపున విమర్శిస్తుంటే మరోపక్క అదే పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చాలా విషయాలలో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు బహిరంగంగానే అసెంబ్లీ వేదికగా మీడియా ముందు మద్దతు తెలపడం జరిగింది. దీంతో జనసేన పార్టీ వర్గాల్లో కార్యకర్తల్లో చాలామంది రాపాక వరప్రసాద్ తీరుపై రకరకాలుగా చర్చించుకోవడం జరిగింది.

అధ్యక్షుడు ఒకలా వ్యవహరిస్తుంటే ఎమ్మెల్యే అధ్యక్షుడు ఆదేశాలను పట్టించుకోకుండా లెక్కచేయకుండా మాట్లాడటం చాలా దారుణమైన కామెంట్లు చేస్తున్న తరుణంలో మంచి చేస్తే ఎక్కడైనా మెచ్చుకోవాలి చెడు చేస్తే అదే స్థాయిలో నిలదీయాలి అనేదే నా నినాదం అంటూ వైయస్ జగన్ చేస్తున్న పనులు మంచివి కాబట్టి పేదవారికి ఉపయోగపడేవే కాబట్టి సపోర్ట్ చేస్తున్నట్లు అదే చెడు చేస్తే అదే విధంగా నిలదీయడం గ్యారెంటీ అని రాపాక వరప్రసాద్ తన వివరణ ఇవ్వటం జరిగింది.

 

అయితే ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాపాక వరప్రసాద్ పై ఓపెన్ గా అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మేటర్ లోకి వెళ్తే గత సార్వత్రిక ఎన్నికల్లో దళితులు దాదాపు వైసిపి పార్టీకే పట్టం కట్టారని ఒకే ఒకటి తెలుగుదేశం పార్టీకి మరొకటి జనసేన పార్టీకి ఎస్సీ నియోజకవర్గంలో గెలవడం జరిగాయని మాట్లాడిన జగన్ ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని జగన్ అన్నారు.

 

ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పలుమార్లు మద్దతు తెలపడం జరిగిందని తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది చరిత్రాత్మక నిర్ణయం అని కానీ తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది అంటూ తీవ్ర స్థాయిలో టిడిపి ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు జగన్. దీంతో రాపాక వరప్రసాద్ పై వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా పొగడటం తో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఊహించని ట్విస్ట్ గా  జగన్ వ్యవహరించిన తీరుపై షాక్ కి గురి అవుతున్నారు.  

 

Read more RELATED
Recommended to you

Exit mobile version