చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..

-

చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గంజాయి మాఫియా నే మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా తేల్చారు చార్మినార్ పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. చార్మినార్ లో టీ కొట్టు వ్యాపారం నడుపుకుంటున్న మృతుడు మధుసూదన్ రెడ్డి.. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ కుమార్ తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆంధ్ర నుంచి గంజాయి తెచ్చి హైదరాబాదులో విక్రయం చేస్తున్న సంజయ్ ముఠా.. మధుసూదన్ రెడ్డి మెల్లగా గంజాయి వ్యాపారంలోకి దించింది. మధుసూదన్ రెడ్డి తో పాటు సంజయ్, జగన్నాథ్ తో కలిసి గంజాయి వ్యాపారం సాగించాడు.

అయితే… గత నెలలో గంజాయి తీసుకు వస్తున్న సంజయ్ అల్లున్ని పట్టుకున్నారు ఆంధ్ర పోలీసులు. ఈ నేపథ్యంలో 40 లక్షలు వరకు మధుసూదన్ రెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్నాడు సంజయ్. అయితే.. తన డబ్బును తిరిగి ఇవ్వాలని సంజయ్ పై ఒత్తిడి తెచ్చాడు మధుసూదన్ రెడ్డి. దీంతో బీదర్ లో డబ్బులు ఇస్తామని చెప్పి కారులో కిడ్నాప్ చేసిన సంజయ్‌ గ్యాంగ్… పాతబస్తీ పరిసర ప్రాంతాల్లోనే మధుసూదన్ రెడ్డి ని హత్య చేసింది. ఆ తర్వాత సంగారెడ్డి సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు సంజయ్. అనంతరం మధుసూదన్ రెడ్డి తో పాటు జగన్నాథం ను కిడ్నాప్ చేశారంటూ మధుసూదన్ రెడ్డి భార్యకు ఫోన్ చేశాడు సంజయ్. దీంతో చార్మినార్ పోలీసులను ఆశ్రయించింది మధుసూదన్ రెడ్డి భార్య. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version