మెదక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ లో బోల్తా కొట్టింది మినీ బస్సు. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మందికి గాయలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట (మం) కమలపూర్ శివారులో NH161పై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి నాందేడ్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది ఓ మినీ బస్సు.
ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరుగగానే… 18 మందిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెదక్ లో మినీ బస్సు బోల్తా కొట్టిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.