విరాట్​ కోహ్లీ బెడ్ రూం వీడియో లీక్ లో బిగ్‌ ట్విస్ట్‌ !

-

ఆసీస్‌ లో విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. టి 20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాలో విరాట్ హోటల్ రూమ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కోహ్లీ రూమ్ లోకి దూరిన ఓ అభిమాని రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోహ్లీ వాడే వస్తువులు, వార్డ్ రోబ్ సహా అన్నింటినీ చిత్రీకరించాడు. కింగ్ కోహ్లీ హోటల్ రూమ్ అంటూ నెట్టింట పోస్ట్ చేశాడు.

ఈ ఘటనపై కింగ్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సాధారణంగా తమకు ఇష్టమైన ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి, వాళ్లను కలపడానికి అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నా పైవసీకి సంబంధించినది. నా రూమ్ లో నాకు ప్రైవసీ లేకపోతే ఇంకా ఎక్కడ ఉంటుంది? దయచేసి అందరూ ఈ వ్యక్తిగత ప్రైవసీని గౌరవించండి ‘అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక దీనిపై హోటల్‌ ప్రతినిధులు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news