శివారాధనలో బిల్వపత్రం కేవలం ఒక ఆకు కాదు అది అపారమైన ఆధ్యాత్మిక శక్తికి పవిత్రతకు ప్రతీక. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పత్రం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ పవిత్రమైన పత్రం శివ పూజలో ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉంది. శివుడికి బిల్వపత్రాలతో పూజించడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది మన మనసును శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకునే ఒక పద్ధతి. బిల్వ వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపమని పురాణాలు చెబుతాయి. ఈ చెట్టు యొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు కొనలో శివుడు కొలువై ఉంటారని విశ్వాసం, అందుకే ఈ పత్రం పూజిస్తే త్రిమూర్తులు ఆశీస్సులు లభిస్తాయి నమ్మకం.
మహాశివుడికి ప్రీతిపాత్రమైనది అభిషేకం, బిల్వపత్రం సమర్పణ. కాసిన్ని నీళ్లు శివలింగం మీద పోసి, బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తే అపారమైన శివ అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. బిల్వపత్రాలు శివుడికి ప్రీతిపాత్రం కావడానికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరమధనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. ఆ భయంకరమైన విషన్ని శివుడు లోకాలన్నిటిని రక్షించడానికి సేవించాడు. ఆ విషం యొక్క తీవ్రతం తగ్గించడానికి దేవతలు బిల్వపత్రాలను ఆయనకు సమర్పించారు .ఆనాటి నుండి బిల్వపత్రం శివుడి కోపాన్ని చల్లారిచే సాధనగా శాంతికి ప్రతీకగా మారిపోయింది అని పురాణాలు చెబుతున్నాయి.

మనం బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు కేవలం ఒక ఆకును సమర్పించడం లేదు మనం మన అహంకారాన్ని కోరికలను, ద్వేషాన్ని, శివుడి పాదాల దగ్గర సమర్పిస్తున్నాం. ఈ పత్రం మూడు ఆకులుగా ఉంటుంది ఇది సత్వ, రజ, తమస్సు అనే మూడు గుణాలకు ప్రతీక. ఈ గుణాల ప్రభావాన్ని అధిగమించి మోక్షం పొందాలని సంకల్పంతో ఈ పత్రాన్ని మహాశివునికి సమర్పిస్తారు. బిల్వపత్రం సమర్పణ ద్వారా మనం మనలో చెడును తొలగించుకొని పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాం.
ఈ దివ్య పత్రంలో ఉండే సుగుణాలు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు దానిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పత్రాన్ని ఆయుర్వేదంలో అనేక వ్యాధులు నివారణకు ఉపయోగిస్తారు. మహా శివునికి బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు ఆ పత్రాలు చెక్కుచెదరకుండా, పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి అలాగే పూజ చేసేటప్పుడు మనసులో భక్తి, శ్రద్ధ ముఖ్యం. ఏ పూజ అయినా మనసుతో చేస్తేనే దానికి నిజమైన అర్థం పరమార్థం వుంటాయి.