మైత్రీలో క‌ల‌క‌లం..కార‌ణాలు అవేనా?

-

మైత్రీ మూవీ మేక‌ర్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు.  మెరుపు వేగంతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది. స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తోంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. అన‌తి కాలంలోనే అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగింది. న‌వీన్, ర‌విశంక‌ర్, మోహ‌న్ అనే ముగ్గురు భాగ‌స్వామ్యంలో ఏర్ప‌డిన సంస్థ తిరుగులేని విజ‌యాలు అందించింది.  న‌ష్టాలే లేని ఏకైక బ్రాండ్ అని  చాటి చెప్పింది.  దిల్ రాజు, అల్లు అర‌వింద్, సురేష్ బాబు లాంటి నిర్మాత‌ల్నే వెన‌క్కి నెట్టిన త్ర‌య‌మ‌ది. తాజాగా ఈ త్ర‌యంలో విబేధాలు త‌లెత్తిన‌ట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. మోహ‌న్ అనే నిర్మాత మైత్రీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆ వార్త సారాంశం.

Breaking: Mohan Out Of Mythri Movie Makers!

వివార‌ల్లోకి వెళ్తే  మోహ‌న్ అమెరికాలో ఉంటారు. ఇక్క‌డ వ్య‌వ‌హారాలు అన్నింటిని న‌వీన్, ర‌విశంక‌ర్ మాత్ర‌మే చూసుకుంటారు. ప్రాజెక్ట్ కు హీరోల‌ను, ద‌ర్శ‌కుల‌ను సెట్ చేయ‌డం..బ‌డ్జెట్ త‌దిత‌ర విష‌యాల‌న్ని ఒకే చేసి ప్రాజెక్ట్ ను మూవ్ చేస్తారు.  షూటింగ్ స‌హా రిలీజ్ అన్ని వీళ్లిద్ద‌రి ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతాయి. మోహన్ భాగ‌స్వామిగా డ‌బ్బులివ్వ‌డం  త‌ప్ప మిగతా విష‌యాలేవి ఆయ‌న‌కు తెలియ‌దు.  ఆ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. అయితే ఇటీవ‌ల చోటు చేసుకున్న కొన్ని ఆర్ధిక లావాదేవాల  కార‌ణంగా మ‌ధ్య మిగ‌తా ఇద్ద‌రితోనే మోహ‌న్ కు మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయ‌ట‌. దీనితోడు మ‌హేష్-సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వ‌డంతో…మ‌హేష్ స్థానంలో బ‌న్నీని తీసుకురావ‌డం వంటివి మోహ‌న్ కు స‌మాచారం ఇవ్వ‌కుండా చేసారుట‌.

ఈ రెండు విష‌యాల్లో అసంతృప్తిని వ్య‌క్తం చేసి మోహ‌న్  భాగ‌స్వామిగా త‌ప్పుకుంటున్నార‌నే కార‌ణాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ముగ్గురు క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తిచేసిన త‌ర్వాత మోహ‌న్ బ‌య‌ట‌కు వెళ్లిపోనున్నార‌ని వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యాలు టాలీవుడ్ మీడియా స‌హా ఫిలిం స‌ర్కిల్స్ లో హ‌ట్ టాపిక్. మ‌రి ఈ రూమ‌ర్స్ లో నిజా నిజాలు ఏంట‌న్న‌వి తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం మోహ‌న్ హైద‌రాబాద్ లోనే ఉన్నారుట‌. త‌రుచూ మైత్రీ ఆఫీస్ కు వ‌చ్చి పోతున్నట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version