వితిక విషయంలో మహేశ్ విట్టాను కొట్టబోయిన వరుణ్ సందేశ్.. అసలేంజరుగుతోంది హౌస్ లో?

-

ఫుడ్ విషయంలో హేమ, రాహుల్ కు మధ్య గొడవ అయిన సంగతి తెలిసిందే. ఆ గొడవ సద్దుమణిగిందో లేదో… పునర్నవి నా చపాతి ఎవరో తిన్నారంటూ హౌస్ మేట్స్ పై ఉవ్వెత్తున లేచింది.

బిగ్ బాస్… ప్రారంభం అయి అప్పుడే ఐదు రోజులు అయింది. నిన్న(గురువారం) జరిగిన ఐదో ఎపిసోడ్ మొత్తంలో హౌస్ లో అంతా గరం గరం. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ షో రక్తికడుతోంది. కాస్త ఆసక్తి పెరుగుతోంది. హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఒకరికంటే మరొకరు ఎక్కువగా ఉన్నారు.

ఫుడ్ విషయంలో హేమ, రాహుల్ కు మధ్య గొడవ అయిన సంగతి తెలిసిందే. ఆ గొడవ సద్దుమణిగిందో లేదో… పునర్నవి నా చపాతి ఎవరో తిన్నారంటూ హౌస్ మేట్స్ పై ఉవ్వెత్తున లేచింది. అలి రెజా.. నా సగం చపాతి తిన్నాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది. కానీ.. చివరకు ఆమె చపాతిని తినలేదని.. బాబా భాస్కర్ రెండు చపాతీలు తిన్నాడని చెప్పడంతో అంతా ప్రశాంతం అయ్యారు. మూడో రోజు ముగిసి… నాలుగో రోజు వచ్చింది.

నాలుగో రోజు అందరూ సాయంత్రం దాకా సరదాగా గడిపాక… సాయంత్రం పూట బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఓ టాస్క్ ఇస్తాడు. ఇంటి సభ్యుల్లో ఇద్దరిని మాత్రం ఎన్నుకోవాలంటాడు. దీంతో హేమ, జాఫర్ ను ఎన్నుకుంటారు. వీళ్లిద్దిరికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తాడు.

వీళ్లిద్దరిని సపరేట్ రూమ్స్ లో ఉంచి… వాళ్ల ముందు ఉన్న బటన్స్ నొక్కాలంటాడు. వాళ్లిద్దరికి రెండు ఆప్షన్స్ ఇస్తాడు. రెడ్, గ్రీన్ బటన్స్ వాళ్ల ముందు ఉంటాయి. ఇద్దరు వేర్వేరు బటన్స్ నొక్కితే వాళ్లకు లగ్జరీ బడ్జెట్ వస్తుంది. లేదా ఇద్దరు ఒకే బటన్ నొక్కితే వాళ్లకు వచ్చే సరుకుల్లోనుంచి ఎగ్స్ కానీ.. పాలు కానీ తీసేస్తానని బిగ్ బాస్ చెబుతాడు.

అయితే.. ఇద్దరు వేర్వేరు బటన్స్ నొక్కడం వల్ల వాళ్లకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ వస్తుంది. అయితే.. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఇచ్చిన 3000 పాయింట్స్ ను వాళ్లు సరిగ్గా ఉపయోగించుకోలేక పోయారు. దీంతో వాళ్లు అనుకున్న సరుకులను పొందలేకపోయారు.

అక్కడ కూడా హేమ, శ్రీముఖి మధ్య చిన్న గొడవ వచ్చింది. శ్రీముఖి పెద్దగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మిగితా సభ్యులు ఆమెను సముదాయించినా ఆమె కోపం మాత్రం తగ్గలేదు.

తర్వాత రాత్రి పూట… మహేశ్ విట్ట, వితికా షేరును ఏదో అన్నాడని.. ఆమె అతడితో గొడవ పెట్టుకుంది. వెంటనే ఇన్వాల్వ్ అయిన వరుణ్.. నా భార్యను ఏమన్నావు.. అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయింది. ఒకానొకదశలో ఇద్దరూ కొట్టుకోబోయారు. మహేశ్ విట్ట కూడా ఆవేశపడ్డాడు. కానీ.. ఇంటి సభ్యులు వచ్చి వాళ్ల గొడవను ఆపేసి అక్కడి నుంచి ఇద్దిరినీ దూరంగా తీసుకెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది. మరి… ఈరోజు(శుక్రవారం) ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version