BIGG BOSS 7: పాట “బిడ్డ” భోలే శృతి తప్పుతున్నాడా ?

-

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా పాట బిడ్డగా భోలెస్ షావలి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భోలే హౌస్ లోకి వచ్చిన మొదటి నుండి ఒక గ్రూప్ కె ఫిక్స్ అయిపోయాడు. అశ్విని, శివాజీ, ప్రశాంత్, యావర్, రతికలతోనే ఉంటూ వస్తున్నాడు. ఇక మరో బ్యాచ్ అమర్, ప్రియాంక, శోభా, తేజ లు అంటే అస్సలు పడడం లేదు. కాగా నామినేషన్ సమయంలో ఎవ్వరు ఇతన్ని నామినేట్ చేస్తున్నా వారికీ విసుగు తెప్పించే పాటలతో, రెచ్చగొట్టే మాటలతో కాలు దువ్వుతున్నారు. వరుసగా రెండవ వారం ఇలాగె జరిగింది. రెండు వారాల క్రితం ప్రియాంక శోభలతో ఎంత గొడవ అయిందో చూశాము. ఇక గత రాత్రి జరిగిన నామినేషన్ లోనూ ప్రియాంక, అమర్ మరియు శోభలను విసుగు తెప్పించే మాటలతో ఇబ్బంది పెట్టాడు. ఆటలు ఆడడానికి వచ్చి తన టాలెంట్ అయిన పాటలతో అలరిస్తున్నాడు..

కానీ ఆ పాటలు ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ విషయం చాలా సార్లు బిగ్ బాస్ చెప్పారు.. కామెడీ అయినా, పాటలు అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకే. అందుకే నెటిజన్లు పాటబిడ్డ భోలే శృతి తప్పుతున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version