బిగ్ బాస్: తెరమీదకు మరో కొత్త ప్రేమ జంట.. లవ్ ట్రాక్ ఎక్కేరా..!

-

బిగ్ బాస్ లో స్నేహం, గొడవలు, పోట్లాటలు, ప్రేమలు, రొమాన్స్ అన్ని సహజంగానే మనం చేస్తూనే ఉన్నాం.. ఇక బాలీవుడ్తో పోల్చుకుంటే టాలీవుడ్ లో కూడా ఈమధ్య ప్రేమలు, పెళ్లిళ్లు బాగా ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు . ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో లవర్స్ గా లవ్ ట్రాక్ ఎక్కిన ఎంతోమంది బయట కూడా అలాగే తమ ప్రేమను కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది బ్రేకప్ చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 మొదలై రెండవ వారం మొదలైన సందర్భంగా తెరపైకి మరో కొత్త ప్రేమ జంట వచ్చింది.

ఇక తాజాగా బిగ్ బాస్ 6 లోకి కంటెస్టెంట్ గా వచ్చిన ఆరోహి , ఆర్ జె సూర్య ఇద్దరూ గత మూడేళ్లుగా మంచి స్నేహితులు. ఇక టీవీ9 స్మార్ట్ న్యూస్ షోలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కొండబాబుగా సూర్య , ఇస్మార్ట్ అంజలిగా ఆరోహీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారని చెప్పవచ్చు . కానీ మంచి స్నేహితులు.. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వీరు కంటెస్టెంట్లు.. కంటెస్టెంట్ల లాగే ఆటలు ఆడుతారా.. లేదా.. లేక అదే స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటారా.. అనేది పక్కన పెడితే.. వీరిద్దరి మధ్య బంధం ఉందని ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది.. ఇక మొన్న జరిగిన ఎపిసోడ్ లో ఆరోహీ మీద కాస్త కంప్లైంట్ లాంటిది చేశాడు సూర్య.

అప్పుడు ఆరోహీ నువ్వు కూడా కంటెస్టెంట్ వే.. ప్లేయర్ వి అని అర్థమైంది అంటూ సూర్య గురించి అనేసింది. ఇక వీరిద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది. దీంతో సూర్య మైక్ ను ఆరోహి దాచేసింది. ఇనయ మైకును తనదిగా భావించి సూర్య ధరించేశాడు.ఇకపోతే తన మైకు ఆరోహి దాచేసిందని తెలిసిన కూడా సూర్య అడగలేదు. సూర్య అడగడం లేదని ఆరోహి కూడా వదిలేసింది.. ఇకపోతే చివరికి వీరిద్దరూ మాట్లాడుకొని ఫన్నీగా పోట్లాడుకున్నారు. ఇక సారీ చెప్పమంటూ ఆరోహీ కాస్త బెట్టు చేసి.. ఏడ్చింది.. చివరికి సూర్య ఐ యాం సారీ..ఐ లవ్ యు.. అని కూడా చెప్పేసాడు.. దీంతో శాంతించిన ఆరోహి.. ఆ తర్వాత హగ్ చేసుకున్నారు.

ఈ బంధాన్ని చూసిన తర్వాత వీరిద్దరి మధ్య లవ్ ఏర్పడిందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మరి ఈ బంధం అలాగే కొనసాగుతుందా లేక స్నేహితులుగానే ఉండిపోతారా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version