బిగ్ బాస్: అవినాష్.. వన్ మ్యాన్ షో.

-

బిగ్ బాస్ చాలా పకడ్బందీ ప్లాన్ తో ప్రేక్షకులకి ఏ రోజు ఏది ప్రెజెంట్ చేయాలో చక్కగా ప్రెజెంట్ చేస్తూ అసలైన వినోదాన్ని అందిస్తున్నాడు. నామినేషన్ల సమయం నుండి హై వోల్టేజీలో సాగే గేమ్ షో, వీకెండ్ కి వచ్చేసరికి సరదాగా, నవ్వులతో ముగిసిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ ఎంత ప్లానింగ్ గా ఉంటున్నాడో అర్థం అవుతుంది. నేటి ఎపిసోడ్ లో ప్రత్యేకంగా టాస్కులేమీ లేనప్పటికీ ఫ్యాషన్ షో ద్వారా గ్లామర్ ని వడ్డిస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు.

ఇంకా అవినాష్ ద్వారా షో నడిపించి వావ్ అనిపించాడు. కాలు బెణికి సరిగ్గా నడవలేకపోతున్న అవినాష్, తనదైన కామెడీ టైమింగ్ తో కూర్చున్న చోటునుండే జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు. అద్దం టాస్కులో అతడు చేసిన టాస్కు అందరినీ మెప్పించింది. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా ప్రెజెంట్ చేస్తూ, కామెడీ పండించాడు. హౌస్ మెంబర్స్ సైతం అవినాష్ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version