బిగ్ బాస్: అవినాష్ అరుపులు.. సోహైల్ ఏడుపులు.. తప్పెవరిదంటే..?

-

బుధవారం జరిగిన ఎపిసోడ్ లో అవినాష్, సోహైల్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. డీల్స్ టాస్క్ లో సంచాలకుడిగా వ్యవహరిస్తున్న సోహైల్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని అవినాష్ వాదించాడు. పేడలోంచి బటన్లు బయటకి తీస్తున్న దివి కాలు బయటకి అడుగుపెట్టడమేంటని అవినాష్ ప్రశ్నించగా, దానికి సోహైల్ అలా పెట్టొచ్చు, నా ఇష్టం అని చెప్పడంతో చిన్నపిల్లల స్కూల్లో మాస్టార్లు చేసినట్టుగా చేస్తున్నావని అవినాష్ అన్నాడు.

ఇక్కడే సోహైల్ బాగా హర్ట్ అయ్యాడు. తన తప్పేమీ లేదని చెప్తున్న సోహైల్ నిజంగా తప్పు చేసాడా అంటే లేదనే చెప్పాలి. అలా అని అవినాష్ అడిగింది కూడా కరెక్టే. బిగ్ బాస్ అలా చెప్పలేదు కాబట్టి కింద అడుగుపెట్టొచ్చని చెప్పిన సోహైల్, అవినాష్ కి సరిగ్గా సమాధానం చెప్పాల్సింది. కానీ అలా చేయకుండా కోపాన్ని అణగపెట్టుకుని ఆఖరికి ఏడ్వడం అందరికీ వింతగా అనిపించింది.

ఒక్క విషయంలో మాత్రం సోహైల్ ని మెచ్చుకోవచ్చు. ఎవరి మీద అరవను అని ప్రామిస్ చేసిన సోహైల్, తన మాట నిలబెట్టుకున్నాడు. కాకపోతే తన మీద తనే అరుచుకోవడం మొదలెట్టాడు. మరి ఈ విషయంలో నాగార్జున సోహైల్ కి ఏమైనా సలహా ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ వారం కెప్టెన్ గా నోయల్ ఎంపికయ్యాడు. వచ్చే వారం నేరుగా నామినేట్ అవుతానని డీల్ కుదుర్చుకున్న కారణంగా కెప్టెన్ గా ఇమ్యూనిటీ లభించదని బిగ్ బాస్ తెలిపాడు. మొత్తానికి డీల్స్ తో పాటు మధ్యలో చిన్నపాటి లవ్ ట్రాక్ లతో పాటు ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version