బిగ్ బాస్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్, ఓటింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనం. నాలుగో వారం పూర్తి చేసుకోబోతోన్న ఈ అతిపెద్ద రియాల్టీ షో నుంచి ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సీనియర్లు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవళ్లి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే రెండో వారమే కరాటే కళ్యాణి ఎలిమినేట్ కావడం కొందరు ఊహించలేకపోయారు.
అబ్బా… బాబీ అన్న ఒకే ఒక్క డైలాగుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన నటి కరాటే కళ్యాణి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అటు వెండితెరపైనా…ఇటు బుల్లితెరపైనా తన హవా కొనసాగిస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. ఒక నటిగానే కాకుండా కరాటేలోనూ అగ్రగణ్యురాలు. ఇండస్ట్రీలో ఒక నటిగానే కాకుండా సింగర్ గా..డ్యాన్స్ లతో దుమ్ము రేపుతోంది. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుంది. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఏపీలో హిందూత్వంపై జరుగుతున్న దాడిపై ప్రశ్నిస్తానని నటి కళ్యాణి తెలిపింది.