నోరు జారడంతో బిగ్‌బాస్ ఇంటి నుంచి పంపేశారు..!

-

తెలుగు లాగే తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్ 3 ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. ఇక తెలుగులో ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమలహాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు.

తెలుగు లాగే తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్ 3 ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. ఇక తెలుగులో ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమలహాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇక అక్కడ కూడా ప్రతి శని, ఆదివారాల్లో కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడుతుంటారు. అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న దర్శకుడు చేరన్ ఒక టాస్క్‌లో భాగంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మరో సభ్యురాలు, నటి మీరా మిథున్ ఆయనపై ఆగ్రం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

 

కాగా చేరన్ వ్యవహారంపై కమల్‌హాసన్ ఇంటి సభ్యులతో చర్చించినప్పుడు కమల్ కూడా చేరన్‌కు మద్దతుగా నిలవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అది అక్కడితో ఆగలేదు. సరిగ్గా చేరన్ వ్యవహరించిన విధంగానే ఇంటి సభ్యుల్లో ఎవరైనా నిజ జీవితంలో చేశారా..? అని కమల్ అడగ్గా.. సభ్యుల్లో ఒకడైన నటుడు శరవణన్ లేచి తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో అమ్మాయిలను టచ్ చేసేందుకే బస్సులు ఎక్కేవాడినని చెప్పడంతో ఈ విషయం మరింత వివాదాస్పదమైంది.

కాగా శరవణన్ చేసిన వ్యాఖ్యలకు ప్రేక్షకులు మండిపడ్డారు. మహిళలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సింగర్ చిన్మయి ఈ విషయంపై సోషల్ మీడియాలో శరవణన్‌పై తీవ్ర స్థాయిలో కోపోద్రిక్తురాలైంది. ఈ క్రమంలో శరవణన్ తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని క్షమించమని కోరాడు.

అయితే శరవణన్ మరో ఇంటి సభ్యుడైన దర్శకుడు చేరన్‌ను కించపరిచే విధంగా మాట్లాడడంతో కమల్.. శరవణన్‌ను తప్పు పట్టారు. దీంతో శరవణన్ నోరు జారినందుకు గాను ఆయన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటకు పంపారు. అయితే శరవణన్ హౌస్‌లో కనిపించకపోవడంతో ఇంటి సభ్యులు ఆయనకు ఏమైనా జరిగిందా..? లేదా ఆయన కుటుంబానికి ఏదైనా జరిగిందా..? అని బాధపడ్డారు. మరి హౌస్‌లో ఉన్న సభ్యులకు అసలు విషయం తెలిస్తే వారు ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version