స్పీడ్ పెంచేసిన బిగ్ బాస్ ఫేం సోహెల్.. మూడో సినిమా

-

బిగ్ బాస్ రియాల్టి షో ద్వారా తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రగా ప‌రిచ‌యం అయిన వాళ్లల్లో సోహెల్ ఒక్క‌డు. నిజానికి బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ల‌క‌న్నా.. సోహెల్ కు ఎక్కువ గానే క్రేజ్ ఉంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బిగ్ బాస్ హీరో సినిమాలు తీయ‌డంలో మాత్రం మామూల్ స్పీడ్ లో లేడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా విడుద‌ల కాకున్నా.. మూడో సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. తాజా గా ఈ రోజు పూజా కార్య‌క్రామంతో సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు.

సోహెల్ మూడో సినిమాను కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండ‌పాటి సినిమాస్ బ్యాన‌ర్ల‌పై ల‌క్ష్మ‌ణ్ మురారి, ర‌మేశ్ మాదాసు, వంశీ కృష్ణ, దొండ‌పాటి ర‌మేశ్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్లే.. నిర్మాత‌లుగా మారి తీస్తున్న సినిమా అని నిర్మాత‌లు తెలిపారు. ఇదీల ఉండ‌గా బిగ్ బాస్ ఫేం స‌య్య‌ద్ సోహెల్ ఇప్ప‌టికే రెండు సినిమాలు వ‌రుస‌లో ఉండ‌గానే మూడో సినిమాను ప్రారంభించాడు.

కాగ సోహెల్ మొద‌టి సినిమా మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ ఇటీవ‌ల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టించిన ఆన‌న్య నాగ‌ళ్ల‌తో బూట్ క‌ట్ బాల‌రాజు అనే సినిమాను కూడా ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా విడుద‌ల కాకుండా.. త‌న మార్కెట్ పై ఏ మాత్రం అంచ‌నాలు లేకండా సోహెల్ వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం ప‌ట్ల అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version