ఘాటు మిర్చి లెవెల్ లో అందాలు ఆరబోస్తున్న కృతి శెట్టి..!

-

కృతి శెట్టి అలియాస్ బేబమ్మ మొదటి చిత్రంతోనే కుర్రాలకు క్రష్ గా మారిపోయిన ఈమె వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన చిత్రంలో నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, దివారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలలో నటించింది. ఇక వీటిలో శ్యాం సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. మిగతా అన్ని చిత్రాలు కూడా ఈమెకు పూర్తిస్థాయిలో డిజాస్టర్ ను మిగిల్చాయని చెప్పవచ్చు.

ఇటీవల విడుదలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో ఉప్పెన తరహా విజయం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా అందాల ఆరబోతతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కృతి శెట్టి కలర్ఫుల్ డ్రెస్ లో అదరగొట్టింది. ఘాటు మిర్చి లెవెల్ లో రెడ్ డ్రస్సులో గ్లామర్ తో రెచ్చిపోయింది. ఎరుపెక్కిన పెదాలతో ఓరకంట కవ్వించే ఫోజులతో కుర్ర కారును తన వశం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కృతి శెట్టి ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తే.. చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ నటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

అన్ని యాంగిల్స్ తో తన పరువాలకి యువతకు విజువల్ ట్రీట్ ఇస్తోంది.. ఈమె కళ్లే ఒక మిస్టరీ అంటూ యూనిక్ మెటీరియల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమాయకత్వంగా చూస్తూ అగ్గి రాజేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఒకవైపు అభిమానులను పెంచుకునే పనిలో ఉన్న కృత్తి శెట్టి మరొకవైపు మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version