బిగ్ బాస్: అంతా అనుకున్నట్టే చేసారుగా..!

-

బిగ్ బాస్ లో ఆదివారం ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. చీకటి గదిలోకి వెళ్ళి మూడు వస్తువులని తీసుకురమ్మని చెప్పిన నాగార్జున గారు, అందరి చేత మూడు వస్తువులు తెచ్చేలా చేసారు. ఒక్కొక్కరుగా హౌస్ లో వెళ్ళినావారిలో ఆడవాళ్ళందరూ చాలా ధైర్యంగా కనిపించారు. హారిక, మోనాల్, చివరికి ఆరియానా కూడా అంతగా భయపడలేదు. మగవాళ్ళలో అఖిల్, సోహైల్, అవినాష్ గజగజ వణీకిపోయారు. అభిజిత్ ఒక్కడే సాఫీగా టాస్క్ పూర్తి చేసాడు.

సండే రోజున బిగ్ బాస్ కి అతిధిగా వచ్చిన హీరో సుదీప్ గారితో హౌస్ మేట్స్ అంతా చాలా మాట్లాడారు. ఐతే ఆదివారం వచ్చిందంటే ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ సారి ఆదివారం ఎలిమినేషన్ ఉండదని అందరూ ఊహించారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లలో అవినాష్ ఒక్కడే కొంచెం వీక్ గా కనిపించాడని, ఈ వారం ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా తెలిసింది.

కానీ అవినాష్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఈ సారి ఎలిమినేషన్ ఉండదని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి సేవ్ అయ్యాడు.ఇదంతా చూస్తుంటే ప్రేక్షకులు అనవసరంగా ఓట్లు వేసారేమో అని అనిపించకమానదు. బిగ్ బాస్ కావాలనే అవినాష్ ని కాపాడుతున్నాడని, అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చారని వినబడుతుంది.

షో పూర్తి కావడానికి దగ్గర పడుతున్న ప్రస్తుత సమయంలో ఎవరి ఊహలకి అందకుండా షో నడిపించాలి గానీ, అన్నీ ముందే తెలిసిపోయేలా నడిపిస్తే ఆసక్తి తగ్గిపోతుందన్న విషయం బిగ్ బాస్ నిర్వాహకులు గుర్తించట్లేదేమో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version