ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరాల జల్లు కురిసింది. సాధారణంగా రాజకీయ పార్టీల మానిఫెస్టోలో వరాలు వుంటాయి. కానీ.. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి పార్టిస్‌పెంట్స్‌పై.. వరాలు ప్రకటించారు. ఒకరికి డబ్బులిచ్చాడు. మరొకరికి తన సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. పార్టిస్‌పెంట్ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తానన్నాడు. బిగ్‌బాస్4లో పాల్గొన్నవారిపై చిరంజీవి కురిపించిన వరాలు ఎగ్జైట్ మెంట్ పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు…
బిగ్‌బాస్ సీజన్ 4 ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చేశాడు. అభిజిత్ విన్నర్‌గా గెలిచాడు. ఈ సందర్భంగా పార్టిసిపెంట్స్ చిరంజీవి మనసును ఆకట్టుకున్నారు. ఎమోషన్‌కు గురైన మెగాస్టార్… సోహైల్ చేయబోయే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రావడమే కాదు.. సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తానని మాటిచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో సోహైల్ ఉపయోగించిన ‘కథ వేరే ఉంటది’ మేనరిజంను సినిమాలో వాడుకుంటానరు చిరంజీవి.
బిగ్‌బాస్ 4 మరో పార్టిస్‌పెంట్ మెహబూబ్‌కు 10 లక్షల చెక్ అందించారు. దీంతో మెహబూబ్ కళ్లనీరు పెట్టుకుంటూ చిరుకు పాదాభివందనం చేయగా.. కళాకారులు కన్నీరు పెట్టొద్దని చిరు వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ ఫైనల్ మెగా వరాల జల్లుగా మారింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివి వైద్యకు తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు చిరంజీవి. వేదళం రీమేక్‌లో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. అజిత్ హీరోగా నటించిన వేదళం రీమేక్‌ను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు.
గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి కొత్తగా కనిపించాడు. కుర్రకారును చూసి ఎమోషన్ అయిన చిరు ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు. ఎమోషనల్‌గా సాగిన చిరు ప్రవర్తన ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. చిరంజీవి దారతను ఎవరూ తప్పుపట్టకపోయినా.. మెగాస్టార్‌లో హుందాతనం తగ్గిందంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. చిరంజీవి ప్రవర్తన కొందరికి విచిత్రంగా అనిపించినా… మెగాస్టార్ అభినులకు మాత్రం తెగ నచ్చిసేందట….