అటవీశాఖాధికారులే పులలను వదిలారా..పోడు పై పులి కుట్ర

-

దట్టమైన అటవి ప్రాంతంలో ఉండాల్సిన పులులు ఇప్పుడు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఎన్నడూ లేని పులుల ఒక్కసారిగా అలజడి సృష్టించడంతో గిరి పుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలీ పులులను అటవీ శాఖ అధికారులే వదిలిపెట్టారా.. లెక్కలతో సహా ఆదివాసీ నాయకులు చెబుతున్నదేమిటి.. పోడుకు ఆదివాసీలను దూరం చేసేందుకు పోడు వ్యవసాయం కోసం అడవికి వెళ్లకుండా ఉండేందుకు అటవీ శాఖ కుట్ర పన్నిందా అన్నదాని పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గత రెండు నెలల కాలం నుంచి పెద్ద పులల సంచారం తెలంగాణలో పెరిగిపోయింది. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం జిల్లా వరకు పులుల సంచారం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పులి చంపివేయగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వచ్చే సరికి ఇప్పటికే మూడు ఆవుల పై దాడి చేసి చంపేశాయి. అక్కడ ఇక్కడ ఒక్కటే పులి అనలేం. అందువల్లనే ఆదివాసీలు చేస్తున్న ఆరోపనలు నిజం ఉందా అన్న అనుమానం వారిలో కలుగుతుంది. తమను అడవిలో పోడు వ్యవసాయం చేయకుండా ఉండేందుకు ఈ కుట్ర పన్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇల్లెందు , పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని అటవీ ప్రాంతంలో ఈ పెద్ద పులి బయపెడుతోంది. గత నెల రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా గిరిజనులను ఈ పెద్ద పులి వేదిస్తోంది. తిరుగుతుంది ఒక్కటే పులి అని అటవీ అధికారులు చెబుతున్నారు.కానీ పినపాక మండలంలో ఇప్పటికే ఒక ఆవు ఒక ఎద్దును చంపివేసింది. అదే విదంగా ఇల్లెందు నియోజకవర్గంలో మరో ఆవు మీద దాడి చేసింది. భద్రాచలం సమీపంలోని సారపాక వద్ద ప్రధాన రహదారి మీదకు కూడ పెద్ద పులి వచ్చిందని అటవీ శాఖ అధికారులు కన్ ఫామ్ చేశారు.అయితే ఈ పెద్ద పులులను వదిలిపెట్టారా అన్న అనుమానాలను ఆదివాసి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అడువుల్లోకి దాదాపుగా 22 పులులు వచ్చాయని అందులో 20 పులులకు ట్యాగ్ లు కూడ వేశారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రధానంగా ఆదివాసీ లు అంతా ఇప్పుడు పోడు మీద ఆదారపడ్డారు. అయితే ఆ పోడు వ్యవసాయాన్ని ఆపాలని అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు పోలీసుల సహకారంతో కేసులు పెడుతున్నారు. అయితేప్పటికి పోడు వ్యవసాయాన్ని ఆపడం లేదు. దీంతో ఈ పెద్ద పులులను వదిలిపెట్టారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం జిల్లా వరకు పెద్ద పులులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీలు.పులిభయంతో చేతికందిన పంటలను సేకరించేందుకు అడవులకు వెళ్లేందుకు ఆదివాసీలు జంకుతున్నారు. సు

పోడు భూములకు ఆదివాసీలకు దూరం చేయాలనే లక్ష్యంతోనే అటవీశాఖాధికారులు పులులను అడవుల్లో వదిలినట్లు గిరిజనులు అంటున్నారు. జిల్లాలో దట్టమైన అడవులు ఉన్నప్పుడు పులులే లేవని ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లాలోని ఏటురునాగారం అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించేందుకు అటవీశాఖాధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, మహరాష్ట్రలోని తడోబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయార్యణ్యాన్ని కలుపుతూ టైగర్‌జోన్‌గా ప్రకటించేందుకు అటవీశాఖాధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని టైగర్ జోన్ చేయడం వెనుక కూడ అటవీ శాఖ కుట్ర ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version