బిగ్ బాస్: అసలైన ఊసరవెల్లి నీవే అంటూ రగిలిపోయిన శ్రీహాన్..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదవ వారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ ఆడియన్స్ కి మంచి మజా ఇచ్చింది. చేపల చెరువు టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ చాలా చక్కగా గేమ్ ఆడి .. తమ స్ట్రాటజీ నిరూపించారు. ముఖ్యంగా చేపల బుట్టలను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషించారు కూడా.. అయితే బిగ్ బాస్ ఒక కండిషన్ పెట్టాడు. కెప్టెన్ ఎవరు వాళ్లలో వాళ్లే డిసైడ్ చేసుకోమని కండిషన్ పెట్టాడు. దీంతో 6 మంది కెప్టెన్సీ పోటీదారులు ఎన్నికయ్యారు. వీళ్ళల్లో చిక్కుముడులు విప్పాలనే టాస్క్ ఇవ్వగా అందులో ముగ్గురు గెలిచారు . కీర్తి , శ్రీహాన్ , సూర్య లు గెలిచారు. దీంతో బిగ్ బాస్ కెప్టెన్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళ కత్తిపోట్లు ఎదుర్కోవాలనే టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడే రాజ్, రోహిత్, రేవంత్ ముగ్గురు సూర్యకి కత్తిపోట్లు దింపారు. బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు దింపారు.

ఇక ఇనయ ఈ గేమ్ లో ట్విస్ట్ ఇచ్చింది. అందరూ సూర్య కి కత్తిపోటు దింపుతుందని అనుకున్నారు.కానీ.. శ్రీహాన్ కి కత్తిని దింపి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ బాగా హార్ట్ అయ్యాడు. అయితే ఇనయ కేవలం ప్రోమో కోసం , కంటెంట్ కోసమే ఇలా చేసిందని అన్నాడు. అంతేకాదు ఇంట్లో బాగా డ్రామాలాడుతుందని , ఇంట్లో అసలైన ఊసరవెల్లి ఇనయానే అని శ్రీహాన్ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు స్టేబులిటీ లేదనీ నన్ను అన్నది కానీ.. తనకే లేదని.. వారానికో రంగు మారుస్తోంది..నాగార్జున గారు సూర్యధి తనది బాండింగ్ బాగుందంటే అటువైపు వెళ్ళిపోతుందని, నాది తనది ఫైటింగ్ బాగుందని చెప్పారు కాబట్టి ఇలా చేసిందని చెప్పాడు. ఇక బాగా రగిలిపోయాడు.

నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా అన్నాడు నిజానికి ఇనయా చాలాసేపు ఆలోచించి ఈ డిసిషన్ తీసుకుంది. హౌస్ మేట్స్ వాసంతి, కీర్తి ఇనయాతో మాట్లాడుతూ సూర్యకి నువ్వంటే సాఫ్ట్ కార్నర్ అలాగే ఉంది అని చెప్పారు. తనకు హెల్ప్ చేయాలని అన్నాడని కూడా అన్నారు. దీంతో ఇనయ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోగానే సూర్యుని గట్టిగా కౌగిలించుకొని బాధపడింది. దీని తర్వాత మరొకసారి సూర్యవైపు గాలి మళ్ళింది. దీంతో సూర్యకి ఓటు వేయాలని అనిపించలేదట. ఇంతే కాదు ఇక్కడ చెప్పిన రీసన్ కూడా శ్రీహానికి ఫన్నీగా అనిపించింది.. అందుకే అతడు బాగా హర్ట్ అయ్యి అసలైన ఊసరవెల్లి నువ్వే అని చెప్పేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version