Big Boss OTT : వాదోపవాదనలు పూర్తి.. ముమైత్ ఖాన్ జడ్జ్ మెంట్ ఎలా ఉండబోతుందో..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ కు బాగా క్రేజ్ వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే 24 హవర్స్ నాన్ స్టాప్ షో గా బిగ్ బాస్ ను ప్లాన్ చేశారు. అలా తెలుగు భాషలో ‘బిగ్ బాస్’ ఓటీటీ స్టార్ట్ అయింది. అయితే, ఈ షోకు అనుకున్నంత వ్యుయర్ షిప్ రావడం లేదని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అంతలా హైప్ క్రియేట్ కాకపోవడమే. కాగా, కేవలం అఖిల్, బిందుల మధ్య గొడవనే ప్రతీ సారి హైలైట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గురువారం నాటి ఎపిసోడ్ అనగా 32వ ఎపిసోడ్ మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అందులో జడ్జిగా ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు. కోర్టు జడ్జిగా ముమైత్ ఖాన్ వ్యవహరిస్తుండగా, శివను వకీల్ సాబ్ చేశాడు బిగ్ బాస్.

ఈ క్రమంలోనే డ్రామా క్రియేట్ చేసేందుకుగాను ప్రయత్నించారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న టాస్కుల పరంగా, పర్ఫార్మెన్స్ లో బిందుమాధవి, అనిల్ రాథోడ్, శివ, అరియానా సేఫ్ జోన్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తేజస్వి, మిత్ర, శ్రవంతి మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు.

ఇక బిందు మాధవి టాప్ పొజిషన్ లో ఉన్నట్లు ఆమె టాస్కులో పర్ఫార్మెన్స్ ఆధారంగా అంచనా వేస్తున్నారు. శ్రవంతికి అతి తక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. వాదోపవాదనలు పూర్తి అయిన తర్వాత జడ్జి ముమైత్ ఖాన్ జడ్జిమెంట్ ఇవ్వబోతుండగా ప్రోమో ముగిసింది. ముమైత్ ఖాన్ ఏ జడ్జిమెంట్ ఇచ్చిందనేది తెలియాలంటే ఎపిసోడ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రాత్రి 9 గంటలకు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version