పుంజుకుంటున్న హైదరాబాద్‌..పెరిగిన కొత్త బిల్డింగ్‌ పర్మిషన్ల దరఖాస్తులు !

-

హైదరాబాద్‌..పుంజుకుంటోంది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో అప్లికేషన్లు.. పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో 39 శాతం అదనంగా పెరిగిందట. కొత్త బిల్డింగ్ పర్మిషన్, లే ఔట్ల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయట. దీంతో కొత్త బిల్డింగ్ పర్మిషన్, లే ఔట్ల అనుమతుల కోసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారట అధికారులు.

Hyderabad is on the rise Increased applications for new building permits

క్షుణంగా పరిశీలించి అనుమతులు ఇస్తున్నారట అధికారులు.. అధికారుల వద్ద పెండింగ్ లేకుండా అన్ని పత్రాలు పరిశీలించి పదిరోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. 2023 లో జూన్ నుండి అక్టోబర్ లో వచ్చిన అప్లికేషన్లు 1356 అని అధికారులు చెబుతున్నారు. 2024 లో అదే జూన్ నుండి అక్టోబర్ వరకు వచ్చిన అప్లికేషన్ లు 1884 వచ్చాయట. గతేడాదితో పొలిస్తే 39 శాతం పెరిగిందని అంటున్నారు. గతేడాది తో పోలిస్తే క్లియర్ చేసిన అప్లికేషన్ లు కూడా 14.4 శాతంగా ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version