తెలంగాణలో మరో దారుణం..హనుమాన్ విగ్రహం దగ్ధం

-

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. హనుమాన్ విగ్రహం దగ్ధం అయింది. భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం అయింది. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు…ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మంటలను నీళ్లతో ఆర్పివేశారు స్థానికులు.

Hanuman Idol Set on Fire

దీంతో ఈ సంఘటన గ్రామంలోని భక్తులను కలవరపెడుతోంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఎవరైనా దుండగులు కావాలని చేసిన‌ చర్యనా లేక ప్రమాదవశాత్తు జర్గిందా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. విగ్రహం దగ్ధం అవడం ఊరికి అరిష్టమంటున్నారు గ్రామస్తులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు అంబటిపల్లి గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version