HYDERABAD : మెట్రో ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్..బిగ్ బాస్ మిమ్మల్ని గ‌మ‌నిస్తున్నాడు..!

-

హైద‌రాబాద్ మెట్రోలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణీకుల‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తోంది. అదేంటి బిగ్ బాస్ మాటీవీ లో వ‌స్తాడు గా అనుకుంటున్నారా..? బిగ్ బాస్ నిర్వాహ‌కులు మెట్రో సంస్థ ఎల్ అండ్ టీ తో ఒప్పందం చేసుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్క్ లు ధ‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు. మాస్క్ లు పెట్టుకోకుండా మెట్రో రైలు ఎక్కిన ప్ర‌యాణీకులకు మాస్క్ లు ధ‌రించండి బిగ్ బాస్ మిమ్మిల్ని గ‌మ‌నిస్తున్నాడు అనే హెచ్చ‌రిక‌లు ఇవ్వ‌నున్నారు.

bigg boss warning in hyderabad metro

దీనిపై ఒప్పందం విష‌మ‌యై బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఎల్ అండ్ టీ అధికారులు…హైద‌రాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్న‌పూర్ణ స్టూడియోస్ లో స‌మావేశం అయ్యారు. 100 రోజుల పాటు మెట్రోలో మాస్క్ లు ధ‌రించాల‌ని ప్ర‌చారం చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రయాణీకుల భ‌ద్ర‌త కోసం వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ్య‌మ‌ని నాగార్జున వెల్ల‌డించారు. అంతే కాకుండా మొబైల్ క్యూ ఆర్ కార్డ్, స్మార్ట్ కార్డులు ఇత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కూడా త‌మ ఉద్దేశ్యమ‌ని కేవీబీ రెడ్డి వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version