వాహనదారులకు ఏపీ రవాణాశాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక పై డాక్యమెంట్లు లేకపోతే కఠినచర్యలు తప్పవని రవాణాశాఖ హెచ్చరించింది. డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు లాంటి డాక్యుమెంట్ ల గడువు ముగిసినా రవాణాశాఖ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పటి నుండి వాటన్నింటిపై జరిమానా విధించాలని రవాణాశాఖ నిర్నయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు.
లైసెన్సులు లేని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వారికి జరిమానాలు విధించనున్నారు. ఇదిలా ఉండగా మొన్నటి వరకూ కరోనా మహమ్మారి కారణంగా రవానాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణస్థితికి రావడంతో మళ్లీ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహనధారులంటూ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.