వెంకీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..”దృశ్యం-2″ నుండి బిగ్ అప్డేట్…!

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచిన సినిమా దృశ్యం. ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రాన్ని ఈనెల 25న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక ఈ నేప‌థ్యంలోనే సినిమా నుండి ఓ లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎన్నో కలలు కన్నా .. అన్నీ కలతలేనా .. చుట్టూ వెలుతురున్నా .. నాలో చీకటేనా అంటూ ఈ పాట కొన‌సాగుతోంది.

bigg update from drishyam 2
bigg update from drishyam 2

ఇక ఈ పాటకు చంద్ర‌బోస్ లిరిక్స్ అందించ‌గా అనూఫ్ రూబెన్స్ స్వ‌రాలు స‌మకూర్చారు. అంతే కాకుండా శ్రేయ గోష‌ల్ ఆ పాట‌ను పాడి ఆక‌ట్టుకుంది. ఇక ఈ పాట‌లోని లిరిక్స్ ఎంతో ఎమోష‌న‌ల్ గా సినిమాలో మీన పాత్ర ప‌డే ఆవేద‌న‌ను చూపించే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే మ‌ల‌యాళ దృశ్యం కంటే దృశ్యం 2 మ‌రింత సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దాంతో తెలుగులోనూ సీక్వెల్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

https://youtu.be/JYfS7W9Q6FE