Bangarraju : బంగార్రాజు నుంచి బిగ్ అప్డేట్…నాగచైతన్య ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

-

అక్కినేని నాగార్జున హీరోగా చేసిన.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది మనకు తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున… బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది.

అయితే..రేపు అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. బంగార్రాజు సినిమా నుంచి అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్‌ లుక్‌ లో నాగ చైతన్య ఊర మాస్‌ గా కనిపించారు. అంతేకాదు… నాగచైతన్య పుట్టిన రోజున అంటే రేపు ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

an

Read more RELATED
Recommended to you

Latest news