పండగ సీజన్ వచ్చింది అంటే చాలు షాపింగ్ మాల్స్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్లు ప్రకటించినట్టుగానే ఎన్నికలు వచ్చాయి అంటే చాలు రాజకీయ నాయకులు ప్రజలందరికీ వరాల జల్లులు కురిపిస్తూ ఉంటారు. కనీవినీ ఎరుగని రీతిలో హామీలు కూడా ఇస్తూ ఉంటారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ మరోసారి విజయం సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తూ ఎంతో వ్యూహాత్మకంగా ప్రజలకు వినూత్నమైన హామీలు ఇస్తుంది.
ఇక బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అందరిని ఆకట్టుకునేందుకు ఇటీవలె సీఎం నితీష్ కుమార్ ఒక సంచలన హామీ ఇచ్చారు. ఇంటర్ పాస్ అయిన బాలికలకు 25000 డిగ్రీ పాసైన వారికి 50 వేల రూపాయలను తప్పక అందిస్తామంటూ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బాలికల అందరిని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ఈ పథకం తీసుకొస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పంచాయితీ పట్టణ స్థానిక సంస్థల్లో కూడా 50 శాతం పదవులను 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మహిళలకే కేటాయిస్తాము అంటూ వరాల జల్లు కురిపించారు నితీష్ కుమార్.