సాధారణంగా సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడతారు. ఆ పరిసరాల్లోకి సైతం ఎవరూ రారు. అలాంటిది ఓ వ్యక్తి నేరుగా సింహం ముందుకు వెళ్లి ధైర్యంగా నిలబడ్డాడు. అంతేకాకుండా దానిని చిన్న కర్రసాయంతో బెదిరించి పరిగెత్తించాడు. ఈ ఘటన మన దేశంలోనే జరిగింది. ఎక్కడో జరిగింది అనుకుంటే పొరపాటే.
గుజరాత్‌లోని భావ్ నగర్ రైల్వే డివిజన్ పరిధిలో ఓ సింహం రైల్వే ట్రాకు మీదకు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.కానీ, ‘ఓ ఫారెస్టు గార్డు మాత్రం ధైర్యంగా దాని వద్దకు వెళ్లాడు. చిన్న కర్ర సాయంతో సింహాన్ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది ఏమైనా ఆవు అనుకున్నావా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సింహాన్ని ఆవు అనుకున్నాడా ఏంటి? చిన్న కర్రతోనే తరిమికొట్టాడుగా!
రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాన్ని ఫారెస్ట్ గార్డ్ ఆవును తరిమినట్లు ఓ చిన్న కర్రతో బయటకు పంపించాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. pic.twitter.com/lNE2JXQU6q
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2025