2024లో మెయిన్ ఫ్రంట్ దే అధికారం : బిహార్ సీఎం నితీశ్ కుమార్

-

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో దిల్లీ వెళ్లిన నితీశ్ ఇవాళ ఎన్సీపీ నేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని.. 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే అది థర్డ్‌ ఫ్రంట్‌ కాదని.. మెయిన్‌ ఫ్రంట్‌ అవుతుందని నితీశ్ అన్నారు. బీజేపీయేతర పార్టీలతో  సమావేశం చాలా బాగా జరిగిందని, సుదీర్ఘ చర్చలు జరిపినట్టు చెప్పారు. పలు రాష్ట్రాల్లోని భాజపాయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయన్నారు. తాను కలిసిన నేతలందరితో సానుకూలంగా చర్చలు సాగాయని చెప్పారు.

బీజేపీయేతర విపక్షాలను ఏకీకృతం చేయడంపై పవార్‌, తాను ఆసక్తితో ఉన్నామని.. నాయకత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. మరోసారి దిల్లీ పర్యటనకు వస్తానని.. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనలో ఉన్న సోనియా గాంధీని తర్వాత కలవనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version