మైక్రోఫాస్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్థిక ఆవిష్కరణల విషయంలో భారత్ విధానాలను ఆయన కొనియాడారు. ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ మరియు ఏదైనా బ్యాంక్ లేదా స్మార్ట్ఫోన్ యాప్స్ తో డబ్బులను పంపే వ్యవస్థతో డిజిటల్ చెల్లింపుల కోసం భారతదేశం ప్రతిష్టాత్మక వేదికలను నిర్మించింది అని ఆయన అన్నారు. దీని వలన పేదలకు లబ్ది చేకూరింది అని ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా ఒక దేశంలో అధ్యయనం చేయాలని భావిస్తే చైనాను పక్కనపెట్టి భారత్ వైపు చూడాలని నేను చెప్తా అని గేట్స్ మంగళవారం సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ లో అన్నారు. అక్కడి విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయని భారత్ చుట్టూ జరుగుతున్న ఆవిష్కరణలు అసాధారణమైనవి అన్నారు. 2016 నుంచి మన దేశంలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెరికా సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.