ఆ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ భయం పుట్టిస్తుంది..

-

ఇప్పటికి దేశవ్యాప్తంగా కరోనా భయంతో తల్లడిల్లిపోతుంటే, రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ భయాన్ని పుట్టిస్తుంది. దీంతో ఆ రాష్ట్రానికి మరో కొత్తరోగం తలనొప్పిగా మారింది. రాష్ట్రంలోని జైపూర్‌ పరిధిలోని జలమహాల్‌ సమీపంలో ఇటీవల బర్డ్‌ఫ్లూతో 7 కాకులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూ కారణంగా రాష్ట్రంలో ఏకంగా 252 కాకులు చనిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని శాఖలతో చర్చలు జరుపుతుంది.

పశుసంవర్ధక శాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కంట్రోల్‌రూమ్‌లు, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులపపై ఆరా తీస్తున్నారు. పంక్షి సంరక్ష కేంద్రాలు,కోళ్ల ఫారాల సంబంధిత యజమానులు అప్రమత్తంగా ఉంటు జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి అనుమానం ఉంటే వెంటనే ప్రభుత్వ కంట్రోల్‌ రూమ్‌లకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి కుంజిలాల్‌ మీనా పేర్కొన్నారు. జోద్‌పూర్, బరన్, కోట, ఝలవార్‌ ప్రాంతాల్లో కాకుల మరణాలు అ«ధికంగా ఉన్నాయన్నారు. పెంపుడు జంతువులు ఈ వైరస్‌ బారిన పండకుండ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

డిసెంబర్‌ 25 నుంచి..

ఝలవార్‌లో గత నెల 25 వ తేదీన కొన్ని కాకులు ఉన్నట్టుండి చనిపోయాయి. సమాచారం అందుకున్న సంబం«ధిత అ«ధికారులు వాటి శాంపిళ్లు సేకరించి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యాజిమల్‌ డిసిజేస్‌కు పంపించగా బర్డ్‌ఫ్లూగా నిర్ధారించారు. ఇప్పటి వరకు కాకుల మరణాలు ఝలవార్‌–100, బరన్‌–72, కోట–47, పలి–19, జోదపూర్‌లో–7 మృతి చెందాయి. కాగా రాష్ట్రం పరిస్థితి అదుపులోనే ఉందని పెంపుడు జంతువులకు ఈ వైరస్‌ సోకకుండా జాగ్రతగా ఉండాలని సంబంధిత అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version