విశాఖలో 5 పైసలకే బిర్యానీ..ఎగబడి కొంటున్న ప్రజలు..!

-

బిర్యాని అంటే ఇష్టపడని వారంటూ ఉండరూ..అది మన బలహీనత అయిపోయింది. ముఖ్యంగా డైట్ లో ఉన్నప్పుడు..బిర్యాని మనల్నీ బాగా టెంట్ చేస్తుంది. ఎంతైనా హోటల్లో ఉన్నట్లు.. ఇంట్లో చేసిన బిర్యాని ఉండదు. రెస్టారెంట్ లో బిర్యాని టేస్ట్ ఉంటుంది వీర లెవల్ అంటే.. కానీ బయట బిర్యాని అంటే.. వందలు ఖర్చుపెట్టాల్సిందే..ఇద్దరు, ముగ్గురు వెళ్తే.. వెయ్యి రూపాయిలు వరకూ అయిపోతాయి. కానీ 5 పైసలకే బిర్యాని ఇస్తే.. ఎగిరిగంతేస్తారేమో కదా.. అసలు ఈరోజుల్లో ఐదు పైసలకు ఏం వస్తుంది.. అలాంటిది కడపునిండా బిర్యాని పెడుతుంది ఓ రెస్టారెంట్.. ఆ ఇదేదో వేర స్టేట్స్ లో ఉంటుంది అనుకుంటున్నారేమో.. కానే కాదు.. మన వైజాగ్ లోనే.

 

విశాఖపట్నంలో ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఐదు పైసలకే బిర్యాని ప్రవేశపెట్టారు. పేదవాడు కూడా బిర్యాని తినాలని ఆ ఆఫర్ ప్రకటించారట. అయితే ఈ ఆఫర్ ప్రతి ఆదివారం మాత్రమే ఉంటుంది. త్వరంలో దీనిని పొడగిస్తూ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందజేస్తాం అంటున్నారు. దీంతో ఈ రెస్టారెంట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి..

జిల్లాలోని… ఎంవీపీ కాలనీ సెక్టర్ 1 వెంకిజి పాలెం దగ్గర ఉన్న పద్మావతి రెస్టారెంట్ ఐదు పైసల బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. దీంతో జనాలు ఆ హోటల్ ముందు క్యూకట్టారు. జనాలు భారీగా రావడంతో హోటల్ రద్దీగా బాగా మారింది. ప్రతి పేదవాడికి బిర్యాని అందజేయడమే తమ లక్ష్యమని హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామంటున్నారు. లాభనష్టాలు చూసుకోకుండా..ఇంత తక్కువ ఖర్చుతో బిర్యాని అందించటం విశేషమే..

గతంలో తమిళనాడులోని మధురై జిల్లాలో కూడా ఐదు పైసలకే బిర్యాని ప్రారంభించారు. కానీ వీరు ఒక వింత షరతు పెట్టారు. కేవలం ఐదు పైసల కాయిన్‌ తీసుకొని వస్తేనే బిర్యాని పెడతామన్నారు. వీరు ఏ ఉద్దేశ్యంతో ఇలా ప్రకటించారో తెలియదు కానీ చాలామంది చెల్లని ఐదు పైసల నాణేలు తీసుకొని హోటల్‌ ముందు క్యూ కట్టడం విశేషం. అవాక్కైన హోటల్‌ నిర్వాహకులు నోరెళ్లబెట్టారు. తప్పక బిర్యాని అందించారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version