Breaking : బీఆర్ఎస్ లో చేరిన బిత్తిరి సత్తి

-

బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హ‌రీశ్‌రావు వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ… రైతుబంధు పేరుతో నేరుగా అకౌంట్లలో పడుతుంటే, వృద్ధులకు ఆసరా పెన్షన్ వస్తుంటే ఇంకా బీఆర్ఎస్‌కు ఓటు ఎవరు వేయకుండా ఉంటారన్నారు. ప్రస్తుతం కొడుకు చెప్పినా తల్లిదండ్రులు వినే పరిస్థితి లేదన్నారు.

పెద్ద పెద్ద హీరోలను కలుస్తావ్… నీకెందుకయ్యా ఈ రాజకీయం, ఈ రాజకీయ నాయకులతో అని తనకు కొంతమంది చెప్పారని, కానీ కేసీఆర్‌ను మించిన మెగా హీరో ఎవరైనా ఉన్నారా? అన్నారు. అందుకే కేసీఆర్‌తో జత కలిశామన్నారు. మనం ఆయన వెంట ఉండాలని, ఆయనను గెలిపించుకొని మురిసిపోవాలన్నారు. నిన్ననో.. మొన్ననో తాను గట్టిగా మాట్లాడానని (ముదిరాజ్ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా) అనుకుంటారేమోనని, కానీ తాను అమ్ముడు పోవడం లేదా కొమ్ముకాయడం చేయడం లేదన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ మొన్న ఓ మాట అన్నారని, తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు మనకు కొట్లాడేవాడు కావాలన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారన్నారు. బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే సీఎం ఆఫీస్ స్పందించిందన్నారు. మనం నీళ్లిచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని, ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. హరీశ్ రావు వంటి బాహుబలిలు ఉండగా ఢోకా లేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version