వినాయక చవితి ఉత్సవాలను కూడా బిజెపి రాజకీయాలకు వాడుకుంటుంది – మంత్రి చెల్లుబోయిన

-

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను కూడా బిజెపి రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. వినాయక చవితికి ఆంక్షలు విధించామని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తూ విఘ్నాలు కలిగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రార్షికోత్సవ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలని మాత్రమే కోరుతున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాలకు గతంలో ఉన్న నిబంధనలను మాత్రమే పాటించమని కోరామన్నారు. విఘ్నాలను పారద్రోలే విధంగా వినాయక చవితి ఉత్సవాలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version