టికెట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. నాయకులకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని… వ్యక్తుల కోసం పనిచేసిన వారికి టికెట్లు రావని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు టికెట్లు ఇస్తామని కొందరిని తిప్పించుకుంటున్నారని… తిప్పంచుకునే వారికి, తిరుగుతున్న వారికి ఇద్దరికి టికెట్లు రావని స్పష్టం చేశారు. వ్యక్తి గత ప్రయోజనాల కోసం కొందరు పని చేస్తున్నారని సున్నితంగా హెచ్చరించారు బండి సంజయ్.